Wikipedia 2006 (Static HTML - No images) is on line here! [.7z dumps also available]
Sorry, English version is not working. Please, connect the వికీపీడియా:పరిచయము - వికీపీడియా

వికీపీడియా:పరిచయము

వికీపీడియా నుండి

ప్రతి వ్యాసము యొక్క పై భాగమున "మార్పు" టాబ్‌ ని చూశారా? వికీపీడియాలో, మీరు లాగిన్‌ అయి ఉన్నా, లేకున్నా, ఎప్పుడైనా పేజీలకు మార్పులు చేర్పులు చేయవచ్చు.

ఈ వికీపీడియా ఏమిటి?

వ్యాసమును దిద్దుటకు ఈ పేజీ పైభాగమునున్న మార్చు ను నొక్కండి
వ్యాసమును దిద్దుటకు ఈ పేజీ పైభాగమునున్న మార్చు ను నొక్కండి

వికిపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇది అనేక మంది రచయితల సమష్టి కృషితో తయారవుతూంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రచయితలు మరెవరో కాదు, పాఠకులే రచయితలు. మీరు కూడా రచయితలు కావచ్చు. ఈ సైటు యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా సభ్యులందరి కృషితో వ్యాసాలను అభివృద్ది చేయడమే! చాలామంది వ్యక్తులు ప్రతి రోజూ వందల కొద్దీ మార్పుచేర్పులు చేస్తూ, నిరంతరం మెరుగు పరచుచున్నారు. ఈ దిద్దుబాట్లు అన్నీ పేజీ చరిత్ర మరియు ఇటీవలి మార్పులు పేజీలలో నమోదు అవుతాయి. అప్రసంగాలు మరియు దుశ్చర్యలు వెంటనే తొలగించబడతాయి మరియు వాటిని సృష్టించిన వారు నిషేధించబడతారు.

నేనెలా తోడ్పడవచ్చు?

వ్యాసాలను సరిదిద్దే విషయమై అందరినీ చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. నిర్లక్ష్యంగా ఉండకండి! సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. వికీపీడియాలో మీరు చేసే దిద్దుబాట్ల వల్ల నష్టము వాటిల్లుతుందని భయపడవద్దు. ఎప్పుడైనా వాటిని సరిదిద్దడము లేదా మెరుగుపరచడము చేయవచ్చు. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే!

దిద్దుబాట్లు చెయ్యడము చాలా సుళువైన పని:

  1. ఈ పేజీ పైభాగమునున్న మార్చు ను నొక్కండి. మీ మొదటి దిద్దుబాటును ఇక్కడికిక్కడే ఈ పేజీలో ప్రయోగించవచ్చును.
  2. సందేశాన్ని టైపు చెయ్యండి.
  3. మీరు రాసిన విషయాన్ని భద్రపరచడానికి పేజీ క్రింది భాగములోనున్న పేజీ భద్రపరచు ను నొక్కండి.
    ... లేదా మీరు చేసిన మార్పులు చూపించుటకు "తేడాలు చూపించు" ను నొక్కండి.
ప్రయోగశాల లో మీ ఇష్టానుసారము దిద్దుబాట్లతో ప్రయోగాలు చెయ్యొచ్చు.


ప్రయోగాత్మక దిద్దుబాట్లు...